సీఎం అయ్యాక ఆ పార్టీ నుంచి ఒక్కరైనా రాజీనామా చేశారా? : వైఎస్ షర్మిల
వ్యక్తిగత కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అలా అనుకుంటే 2019లోనే ఇక్కడ అడుగు పెట్టేదాన్ని అని వ్యాఖ్యానించారు. పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదన్నారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. ఈ విషయంలో తల్లి ఎలాంటి ఏపీని జగన్ వెన్నుపోటు పొడిచారు. ప్రతిపక్ష నేతగా నిరాహార దీక్షలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్నారు. సీఎం అయ్యాక ఆ పార్టీ నుంచి ఒక్కరైనా రాజీనామా చేశారా? ఒక్కటైనా నిజమైన పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. హోదా మన బిడ్డల హక్కు, దీన్ని ఎంతమంది పట్టించుకున్నారు? అది వచ్చి ఉంటే రాజధాని, పోలవరం మనం కట్టుకోలేమా? మన రాష్ట్రం ఎందుకు తక్కువగా ఉండాలి. ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ, ఆయన మాటతోనే నేను ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టా అని అన్నారు.













