వారికి రూ. 2 లక్షల సాయం : వైఎస్ జగన్
నెల్లూరు జిల్లా కందుకూరు తెలుగుదేశం పార్టీ సభలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. ఆ మేరకు అధికారులను ఆదేశించారు. కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ఇదేం ఖర్మ రాష్ట్రానికి సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. మొత్తం 8 మంది మృతి చెందగా వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు పడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.













