ఆంధ్ర రాజకీయ కాష్టం లో అవిరైపోయిన గీతాంజలి.. ఆ పాపం ఎవరిది?
ఎన్నికల సమయంలో ఎక్కడ ఏమి జరిగినా రాజకీయ పార్టీలకు ముడి పెట్టడం సర్వసాధారణమైపోతోంది. ఇదే క్రమంలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతుంది. టీడీపీ,జనసేన ట్రోల్లింగ్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది అని వైసీపీ ఆరోపిస్తుంటే ..ఇదంతా వైసీపీ గుండాలు చేసిన పని అని టీడీపీ -జనసేన కొట్టి పారేస్తున్నారు. రీసెంట్ గా గీతాంజలి అనే మహిళ తనకు జగనన్న పథకాలు అందాయి అంటూ ఎంతో సంతోషంగా చెప్పిన వీడియో వైరల్ అయింది. జగన్ జనం కు చేస్తున్న మంచి ఇలా ప్రచారం కావడం ఇష్టం లేని టీడీపీ..జనసేన పార్టీ శ్రేణులు.. ఆమె మాట్లాడిన విషయాల గురించి ఎద్దేవా చేస్తూ..కాకుల్లా పొడిచి తీవ్రంగా ట్రోలింగ్ కు గురి చేశారని. అందుకే ఆమె తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఈ విషయం పై స్పందించిన టీడీపీ.. వైఎస్ జగన్ సిద్ధం సభ అట్టర్ ప్లాప్ కావడం, ఎలక్షన్ ముందు సింపతి కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్ లు ఇలా సరికొత్త ఫేక్ ప్రచారంతో ప్రజల దృష్టి మరలించడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది..గీతాంజలి ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆమె గురించి అజయ్ సజ్జా వీడియో తీశారు. కాబట్టి ఒక రకంగా చూస్తే ఇలా ట్రోల్లింగ్ జరుగుతుంది అని ఆమెకు ముందుగా తెలిసి ఆస్కారం అయితే లేదు కదా అంటున్నారు టీడీపీ నేతలు. అంతే కాదు యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటనను తమ మీద బురద చల్లడానికి అధికార పార్టీ ఇలా వాడుకుంటుంది అని వారు ఆరోపిస్తున్నారు. ఎవరి మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల రాపిడికి ఓ నిండు ప్రాణం బలైపోయింది.













