Ganta Srinivasa Rao :ఎంపీ పదవికి రాజీనామా చేసినా .. చట్టం నుంచి తప్పించుకోలేరు

ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి (Vijayasai reddy) రాజీనామా చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao )అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడుతూ విజయసాయితో విశాఖపట్నం (Visakhapatnam) లో పడిన ఇబ్బందులు, జరిగిన విధ్వంసం, దాడులను ప్రజలు మరిచిపోలేదని తెలిపారు. వైసీపీ మునిగిపోయిన నావ అని ఎప్పుడో చెప్పాం. ఇప్పుడు అది నిజమవుతోంది. జగన్ (Jagan) నైజమే దీనికి కారణం. మరికొంతమంది ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ నేతలు కళ్లుండీ చూడలేని కబోదులు, స్టీల్‌ప్లాంట్‌పై ఇంకా వక్రంగానే మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసంతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారు. దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ నమ్మకం కలిగించారు. ఏపీ బ్రాండ్‌ను వారిని వివరించారు అని అన్నారు.











































































