మే 28న చంద్రబాబే మళ్లీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 146 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం ఖాయమని, తద్వారా మే 28న చంద్రబాబే మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య ధీమా వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ మహాసభల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. కాగా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అందించే పింఛన్లకు ఎన్నికల కోడ్ విధించడం దారుణమని, దీనిపై ఈసీ, సీఎస్ స్పందించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లోనూ బ్రాహ్మణ కార్పొరేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి రామకృష్ణారావు పాల్గొన్నారు.













