మాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. వేమిరెడ్డి
ఎన్నికల సమయం కావడంతో కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. వీటికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అబద్ధమని తేల్చి చెప్పారు వేమిరెడ్డి. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోంది అని అన్నారు. ఇటువంటి ప్రచారాలను నమ్మొద్దని.. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తాను.. కోవూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ తరఫునే పోటీ చేస్తున్నామని ఆయన స్పష్ఠీకరించారు. అంతేకాదు సైకిల్ గుర్తుపై తామిద్దరూ గెలిచి తీరుతాము అని ధీమా వ్యక్తం చేశారు. నిన్న నెల్లూరులో ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రజలలో తమకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేని కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ లోకి వచ్చి చేరుతున్న వారి సంఖ్య చూసి కొందరు అసూయ పడుతున్నారని ప్రశాంతి రెడ్డి అన్నారు.













