తెలుగుదేశంలోకి వాణీవిశ్వనాథ్
ప్రముఖ సినీ నటి వాణీవిశ్వనాథ్ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. చిత్తూరు జిల్లా నగరికి చెందిన టీడీపీ సీనియర్ నేతలైన ఆనం శ్రీహరి నాయుడు, దూర్వాసులు నాయుడు, హరినాయుడు, రామానుజం చలపతి తదితరులు చెన్నై వచ్చి వాణీవిశ్వనాథ్ను కలుసుకున్నారు. టీడీపీలో చేరాలని ఈ సందర్భంగా వారు ఆమెను ఆహ్వానించారు. ఇందుకు అమె అంగీకరించారు. ఈ సందర్భంగా వాణీవిశ్వనాథ్ మాట్లాడుతూ తన అభివృద్ధికి కారకులైన తెలుగువారికీ ఏదైనా చేయాలని ఎంతో కాలంగా అనుకుంటున్నానన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వమంటే అభిమానమన్నారు. దక్షిణభారతదేశం ఆయన నాయకత్వం గురించి, ఆయన విజన్ గురించి ఇప్పుడు విశేషంగా చర్చించుకుంటోందని అందుకే త్వరలోనే అమరావతి వెళ్లి టీడీపీలో చేరతానని అన్నారు.













