ఏపీ మండలి చిఫ్‌విప్‌గా ఉమ్మారెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రభుత్వ చిఫ్‌విప్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయుడుకు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వరావు శాసనమండలిలో అధికార పార్టీకి చెందిన సీనియర్ సభ్యునిగా వున్నారు. ఆయనకు ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి దక్కుతుందని భావించారు. అయితే ఆయన సామాజిక వర్గానికి కేటాయించిన పదవుల్లో నలుగురికి అవకాశం దక్కింది. పదవి కన్నా పార్టీ ముఖ్యమని భావించిన ఉమ్మారెడ్డి ఒక రకంగా మంత్రివర్గం రేసు నుంచి తప్పుకున్నారు. ఇప్పుడాయనకే కేబినెట్ హోదాతో శాసనమండలిలో చీప్‌విప్ హోదా లభించింది. తనపై అత్యంత గౌరవంతో చీప్‌విప్ నియమించేందుకు సహకరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.













