హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మొదటి కోర్టు హాలులో ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదముద్ర వేసి, ఉత్తర్వులు జారీ చేశారు.













