టీటీడీ కి అరుదైన గుర్తింపు…
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు గాను టీటీడీకి ఇంగ్లాండ్‌కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. తిరుమలలో టీటీడీ పాలకమండలి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి ఆ సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భందగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీకి ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌక్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని తెలిపారు.రోజుకు 3.5 లక్షల లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్లు తెలిపారు.













