‘కల్యాణమస్తు’ కు ముహూర్తం ఫిక్స్
కొన్ని సంవత్సరాల పాటు నిలిచిన ‘కల్యాణమస్తు’ తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. మే 28, అక్టోబర్ 30, నవంబర్ 17 తేదీల్లో కల్యాణమస్తు నిర్వహిస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ప్రకటించారు. అయితే ఎక్కడ జరిపించాలన్న విషయాన్ని మాత్రం పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇందులో పాల్గొనే వారికి రెండు గ్రాముల తాళిబొట్టును ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2007 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వధూవరులకు టీటీడీ తరపున నూతన వస్త్రాలు, బంగారు తాళిబొట్టుతో పాటు 50 మందికి భోజనాలను పెట్టాలని నిర్ణయించారు. 2011 వరకూ ఈ కార్యక్రమం కొనసాగింది. ఆ తర్వాత దీనికి బ్రేక్ పడింది. తాజాగా ఈ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది.













