పదేండ్ల తర్వాత మరోసారి కల్యాణమస్తు!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పదేండ్ల తర్వాత మరోసారి కల్యాణమస్తును ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో కల్యాణమస్తు కార్యక్రమం కింద పేద జంటలకు వివాహాలు జరిపించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నది. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శ్రీవారి ఆలయ పండితులు భేటీ అయ్యీరు. మే 28 మధ్యాహ్నం 12:34 నుంచి 12:40 వరకు, అక్టోబర్ 30 ఉదయం 11:04 నుంచి 12:40 వరకు, నవంబర్ 17 ఉదయం 9:56 నుంచి 10:02 వరకు కల్యాణమస్తు ముహూర్తాలను నిర్ణయించి లగ్న పత్రిక రాశారు. కల్యాణమస్తులో వివాహం చేసుకొనే జంటలకు మంగళసూత్రం, నూతన వస్త్రాలు, 40 మదికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామని టీటీడీ తెలిపింది.













