Donald Trump: తాను తీసుకున్న చర్యలవల్లే.. అక్రమ వలసలు తగ్గాయి : ట్రంప్
తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా(America )-మెక్సికో (Mexico) సరిహద్దుల్లో అక్రమ వలసలు (Illegal immigration) భారీగా తగ్గినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. ఫిబ్రవరిలో అక్రమ వలసల సంఖ్య చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరిందని వెల్లడిరచారు. అమెరికాపై అక్రమ వలసదారుల దండయాత్ర ముగిసిందని అభివర్ణించారు. ఫిబ్రవరిలో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డారని పేర్కొన్నారు. జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి నెలా దేశంలోకి 3 లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని గుర్తు చేశారు.













