Raja Saab: “రాజా సాబ్” సినిమా నుంచి ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” టీమ్ ప్రేక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘రాజే యువరాజే..’ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో ప్రభాస్ క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధి అగర్వాల్ తో ప్రేయర్ చేయించుకోవడం చూపించారు. ఈ సాంగ్ ప్రోమో ద్వారా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ విశెస్ చెప్పడం యాప్ట్ గా ఉంది. త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు.
సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా “రాజా సాబ్” ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. “రాజా సాబ్” రిలీజ్ కోసం రెబల్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






