Minister Komatireddy:భారతదేశం ప్రపంచంలో తొలిస్థానంలో : మంత్రి కోమటిరెడ్డి
రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్‌గా ఉండేలా చేస్తున్నామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. అధికారులతో సమీక్ష అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను మూడున్నరేళ్లలో పూర్తి చేస్తామన్నారు. వాటిని 15 ప్యాకేజీలు గా విభిజించినట్లు తెలిపారు. హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం (India) ప్రపంచంలో తొలిస్థానంలో ఉంది. మన దేశంలో తెలుగు రాష్ట్రాలు (Telugu states) ముందున్నాయి. రోడ్డు భద్రతపై దృష్టి సారించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కూడా చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS government) చివరి ఐదేళ్లలో రోడ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. మేం రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్స్పాట్లు గురించి మరమ్మతులు చేపడుతున్నాం. ముందు 4 లైన్లు అనుకున్న ఆర్ఆర్ఆర్(RRR) ను 6 లైన్లుగా నిర్మించనున్నారు. డీపీఆర్‌ను 6 లైన్లుగా మార్చడం వల్లే టెండర్ల ప్రక్రియలో ఆలస్యం అవుతోంది అని తెలిపారు.













