అందుకే ముందస్తు వెళ్లే ఆలోచన : అచ్చెన్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఛాలెంజ్ చేస్తున్నారు కదా, ఎన్నికలకు వెళదామంటూ వైసీపీకి సవాల్ చేశారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇంకా వ్యతిరేకత పెరిగితే నష్టం జరుగుతుందని అన్నారు. అందుకే వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని అన్నారు. తోందర్లోనే ఎన్నికలు వస్తాయని ప్రజలు అనుకుంటున్నారని, మేము కూడా భావిస్తున్నామని అన్నారు. ఈసారి టీడీపీకి 160 సీట్లు వస్తాయని అన్నారు. గుడ్డిగా చెప్పడం లేదని, రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయని అన్నారు.











































































