రాజ్యసభ బరిలోకి టీడీపీ
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీచేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ తరపున పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బరిలోకి దిగనున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో ఒక్క సీటులోనైనా గెలిచేందుకు అసెంబ్లీలో సరిపడా సంఖ్యాబలం టీడీపీకీ లేదు. అయినా పోటీకి నిర్ణయించుకోవడం విశేషం. దీనిపై చంద్రబాబు మాట్లాడుతు అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల ఓట్లు పొందారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఆ వర్గానికి మాత్రం సీటు ఇవ్వలేదు. మేం ఇవ్వలేనప్పుడు మమ్మల్ని నిలదీశారు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చినా ఎందుకివ్వలేదు? ఈ ఎంపికలపై ప్రజల్లో చర్చ జరగాలి అన్నారు.













