Sri Krishna Deva Raya: వికసిత్ భారత్‌లో ఏపీ ముఖ్య పాత్ర : శ్రీకృష్ణదేవరాయులు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు (Sri Krishna Deva Raya) తెలిపారు. ఢిల్లీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి 8 నెలల్లోనే రూ.లక్షల కోట్ల నిధులు వచ్చాయని అన్నారు. బడ్జెట్ (Budget)లో లేనివాటికి సైతం కేంద్రం సాయం చేస్తోందని వెల్లడిరచారు. వికసిత్ భారత్‌లో ఏపీ ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని నీతి ఆయోగ్ చెప్పింది. 2023 నాటికి రెవెన్యూ గ్రోత్ (Revenue Growth) చాలా పడిపోయింది. 2014-19 మధ్య రూ.వందలో రూ.59 ఖర్చు పెట్టాం. ఇదే 2019-24 మధ్య రూ.వందలో 22.54 మాత్రమే ఖర్చు పెట్టారని నీతిఆయోగ్ (NITI Aayog) తెలిపింది. ఏపీ పరిస్థితి మెరుగుపర్చేందుకు కృషి చేయాలని, విద్యాప్రమాణాలు పెంచే స్టార్స్ కార్యక్రమంలో ఏపీని కూడా చేర్చాలని కేంద్రాన్ని కోరాం. నదుల అనుసంధానికి నిధులు ఇవ్వాలని కోరాం అని తెలిపారు.













