ఘనంగా రామ్మోహన్ నాయుడి వివాహం
దివంగత కింజరాపు ఎర్రన్నాయుడి తనయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడి వివాహం పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రెండో కుమార్తె శ్రావ్యతో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. నూతన వధూవరులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీర్వదించారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, సురేష్ ప్రభు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ, వైకాపా, కాంగ్రెస్ నాయకులు, సినీ నిర్మాతలు, వ్యాపార ప్రముఖులు, అధికారులు, తెలంగాణ టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింహలు, గరికపాటి మోహనరావు తదితరుల వివాహానికి హాజరయ్యారు.













