Atchannaidu: ఆ పార్టీకి ప్రజా ఉద్యమాలు చేసే అర్హ త లేదు : అచ్చెన్న
అసెంబ్లీకి రాకుండా పులివెందుల (Pulivendula) ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతున్న జగన్ (Jagan) పార్టీకి ప్రజా ఉద్యమాలు చేసే అర్హ త లేదని మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీల (Medical colleges)కు కేంద్రం ఇచ్చిన రూ.1,550 కోట్లే ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు చేయలేదు. జగన్ కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీపీపీ (PPP) విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తామంటే, అడ్డుపడుతున్నారు. వైసీపీ నాటకాలను ప్రజలు గమనించి, తిరస్కరించాలి. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతాయి. పీపీపీ విధానంలో మెడికల్ సీట్లు 500 నుంచి 2 వేల దాకా పెరుగుతాయి. పేద, మధ్య తరగతి విద్యార్థులకు 850 సీట్లు కేటాయింపు ఉంటుంది అని అచ్చెన్న పేర్కొన్నారు.






