మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు మండలం మాదేపల్లికి వచ్చిన ఆయనను ఏలూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. పెదవేగి మండలం బి.సింగవరం గ్రామంలో చింతమనేని ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. అనంతరం వైకాపా-టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వైకాపా నేతల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలంలో చింతమనేని లేనప్పటికీ ఆయనపైనా కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్ చేశారు.













