ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం తప్పా?

కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం తప్పా? అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆంధప్రదేశ్‍లో వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొరతపై టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టింది. ఇళ్ల వద్దే ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆ పార్టీ నేతలు, నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ సలహాలు తీసుకోకుండానే తమపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో లాక్‍డౌన్ పెడితేనే ప్రజల ప్రాణాలు నిలుస్తాయని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు ముఖ్యం. కరోనా వ్యాపి నివారణపై శ్రద్ద పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. కరోనా మృతుల బంధువుల ఆర్తనాదాలు ముఖ్యమంత్రికి వినిపించడం లేదా? ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని మండిపడ్డారు.