Chandrababu :ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, లోకేశ్ నివాళి
ఎన్టీఆర్ భవన్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. వేడుకలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) , మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహాని (NTR statue )కి చంద్రబాబు, నారా లోకేశ్, పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అంతా కష్టపడాలన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో చంద్రబాబు, లోకేశ్ వెంట ఉండాలని చెప్పారు. తన ప్రాణం ఉన్నంతవరకు చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానన్నారు.













