Rammohan Naidu : దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర : రామ్మోహన్ నాయుడు
టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఢల్లీిలో ఘనంగా జరిగాయి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు (Sri Krishna Deva Raya) నివాసంలో జరిగిన ఈ వేడుకలకు టీడీపీ ఎంపీలు (TDP MPs) హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) మాట్లాడుతూ ఎలాంటి కష్టాలు వచ్చిన టీడీపీ ఎదుర్కొని నిలబడిరది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. చంద్రబాబు (Chandrababu ) నాయకత్వంలో కలసికట్టుగా ముందుకెళ్తున్నాం. బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటున్న పార్టీ టీడీపీ. ఈ పార్టీ మాకు కన్న తల్లి లాంటిది. తెలుగు వాళ్లు ఎక్కుడున్నా పార్టీ అక్కన చేర్చుకుంటుంది అని అన్నారు.













