టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నికుమారి లక్ష్మి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థినిగా చిన్ని కుమారి లక్ష్మిని నిలబెడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ స్థానానికి విపరీతమైన పోటీ నెలకొనగా చివరికి చిన్నికుమారి లక్ష్మికి అవకాశం దక్కింది. వీరి కుటుంబం మొదటి నుంచి టీడీపీలో ఉంది. ప్రస్తుతం ఆమె జీవీఎంసీ రెండో వార్డు కార్పొరేటర్‌గా ఉన్నారు. గతంలో భీమిలి పురపాలక సంఘం వైఎస్ చైర్మన్‌గా పని చేశారు. టీడీపీ రాష్ట్ర మహిళా విభాగంలో రెండుసార్లు పనిచేశారు.













