ప్రజా మేనిఫెస్టోకి పిలుపునిచ్చిన కూటమి..
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సరికొత్త స్ట్రాటజీతో ప్రజల ముందుకి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ప్రజా మేనిఫెస్టో రూపకల్పన కోసం పిలుపునిచ్చారు. ఇందుకు గాను ఓ వాట్సాప్ నెంబర్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 83411 30393 నెంబర్ కు ప్రజలు తమ సూచనలను అందించవచ్చు. మేనిఫెస్టో రూపకల్పనకు అవసరమైనటువంటి సలహాలు, సంప్రదింపులు చేయాలి అనుకున్న వారు ఈ వాట్సాప్ నెంబర్ కి తమ అభిప్రాయాలను పంపించవచ్చు. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలతో మ్యానిఫెస్టో రూపకల్పన చేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలియజేశారు. అంతేకాదు ఇప్పటివరకు దేశంలో ఎక్కడ కూడా ఇలా ప్రజల అభిప్రాయం తీసుకొని మేనిఫెస్టో రూపకల్పన చేసింది లేదు అని ఆయన పేర్కొన్నారు.













