విజయవంతముగా ముగిసిన తానా మెగా ఐ క్యాంపు
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం, తోటరావులపాడు గ్రామము నందు తానా మరియు రోటరీ హాస్పిటల్ విజయవాడ వారు సంయుక్తముగా డిసెంబర్ పదకొండవ తేదీ తానా మెగా ఐ క్యాంపు నిర్వహించడం జరిగినది. సుమారు మూడువందల పైగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ కళ్ళ జోళ్ళు పంచడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా హాజరైన గ్రామ పెద్దలు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమానికి గోపాలకృష్ణ శీలంనేని గారు స్పాన్సర్ చెయ్యడం జరిగినది. కార్యక్రమానికి తోటరావులపాడు గ్రామ వాస్తవ్యులు సుధాకర్ శీలంనేని గారు, తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.













