గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ ఉచిత మెగా వైద్య శిబిరాలు ఉపయుక్తం : అంజయ్య చౌదరి లావు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా బాపులపాడు వీరవల్లీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు.
గ్రామ ప్రముఖలు రాష్ట్ర తెలుగురైతు కార్యనిర్వహక కార్యదర్శి గుండపనేని ఉమావరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, అతిథులుగా తానా ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, ఫౌండేషన్ ట్రస్టీ గారపాటి విద్యాధర్, కమ్యూనీటి సర్వీసు కో ఆర్డినేటర్ కసుకుర్తి రాజా, విజయ డైయిరి ఛైర్మన్ చలసాని అంజనేయలు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, వీరవల్లి గ్రామ సర్పంచ్ పిల్లా అనిత పాల్గొన్నారు.
అనంతరం గుండపనేని ఉమావరప్రసాద్ మాట్లాడుతూ తానా సంఘం లో ప్రవాసాంధ్రులుగా ఉన్న కసుకుర్తి రాజా వీరవల్లీ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో విద్య , వైద్య ,సామాజిక అభివృద్ధికి, గ్రామంలో కోవీడ్ నివారణకు అనేక కరోనా మందులను పంపిణీ చేశారని గుర్తుచేశారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మన ప్రాంతం వాడు కావటం, తానా ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ మా బంధువు అవ్వటం తానా ఫౌండేషన్ కో ఆర్డినేటర్ గారపాటి విద్యధర్ పశ్చిమగోదావరి జిల్లా అయనప్పటికి వీరవల్లీ తో సత్ సంభంధాలు ఉండటంతో అభివృద్ధి, సేవా కార్యక్రమాలు మరింత ఎక్కువగా చేయటానికి దోహదపడుతుందని ఉమావరప్రసాద్ అన్నారు.
తానా ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించటంలో తానా ముందంజలో ఉంటుందని, ఇటువంటి కార్యక్రమాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథి తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా, గ్రేస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో 100 ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం, గ్రంధాలయాల ఆధునీకరణ, వ్యవసాయ రంగాలు లాంటి 25 రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామస్తుల సహకారంతో వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతాయని తానా ఫౌండేషన్ ట్రస్టీ గారపాటి విద్యాదర్ తెలిపారు.
విజయ డైయిరి ఛైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో తానా ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
వీరవల్లీ గ్రామస్తుడు తానా కమ్యూనిటి కో ఆర్డినేటర్ కుసుకుర్తి రాజా మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గ్రామానికి సేవ చేసి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో వీరవల్లీ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి గ్రామస్తుల సహకారం మాటల్లో చెప్పలేమన్నారు. గతంలో పాఠశాల విద్యార్థులకు సిపిఆర్ ట్రైనింగ్(లైఫ్ సేవింగ్ ) ఇచ్చామని, కరోనా కిట్లు పంపిణీ చేశామన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరం పాఠశాల అభివృద్ధి తన వంతుగా కృషి చేశానని కసుకుర్తి రాజా గుర్తు చేశారు. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి విషయంలో తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
సాగు వినియోగ దారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లడుతూ తానా సంఘ సబ్యులు అమెరికాలో స్తిరపడినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాతృభూమి కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అభినందనీయం అని కృష్ణా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ల్లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్ధిని, విద్యార్థులకు గతంలో వలె తానా సంస్థ నుంచి ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోచాహించాలని తానా పాలక వర్గ సబ్యులకు విజ్ఞప్తి చేశారు.
సభ్యులు పిల్లా రామారావు మాట్లాడుతూ మా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయటం ద్వారా ఎంతోమంది పేదలు, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రామంలో మరిన్ని అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు తానా తనవంతు సహకారం అందించాలని కోరారు.
గ్రామ ప్రముఖలు లంక సురేంద్ర మోహన బేనర్జీ మాట్లాడుతూ బాపులపాడు మండలం లోనే వీరవల్లీ మేజర్ పంచాయతీని తానా సభ్యులు సేవా కార్యక్రమాలతో పాటు గ్రామ అభివృద్ధికి పాటు పాడాలన్నారు.
అనంతరం వైద్యాధికారి డాక్టర్ శిరిషా అసుపత్రి లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను తానా సభ్యులకు చూపించారు. గ్రామ ప్రముఖలు కలిసి తానా సభ్యులను శాలువ పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నందమూరి శ్రీనివాస మురళీకృష్ణ ప్రసాద్, వైద్యాధికారి శిరీషా, అవిర్నేని శేషగిరిరావు, ఎంపిటిసి అమృతనల్లి సూర్యనారాయణ, ఉప సర్పంచ్ లంక అజేయ్, కలపాల శ్రీధర్, అత్మూరి బాలాజీ, మండాది రవీంద్ర, కోడేబోయన బాబీ, గుండపనేని వేణుగోపాల్, లంక వెంకటేశ్వరరావు.వీరవల్లీ అసుపత్రి వైద్య సిబ్బంది, గ్రేస్ ఫౌండేషన్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.













