Nara Lokesh: ఫ్రీబస్ టికెట్‌తో సెల్ఫీ దిగి షేర్ చేయండి: నారా లోకేశ్

ఉచిత బస్సు పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని మహిళలను కోరారు. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న టికెట్‌తో సెల్ఫీ దిగి, దాన్ని #FREEbusTicketSelfie అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి మహిళకు సురక్షితమైన, గౌరవప్రదమైన ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని లోకేష్ (Nara Lokesh) చెప్పారు. ఈ ఉచిత బస్సు టికెట్ ఆశ, స్వేచ్ఛ, గౌరవాన్ని సూచిస్తుందని అన్నారు. ఇది స్వాతంత్ర్యం, సమానత్వం వైపుగా వేసిన అడుగు అని అభివర్ణించారు. “స్త్రీ శక్తి, ఉచిత బస్సు ప్రయాణ పథకం” ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం తమ ప్రభుత్వానికి గర్వకారణమని మంత్రి లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. ఈ పథకం మహిళల ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.