ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు న్యాయాధికారులకు హైకోర్టు జడ్జిలుగా కొలీజియం పదోన్నతి కల్పించింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన వారిలో అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యామ్సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జుననావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు.













