హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రస్తుతం అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మే 16న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏకగీవ్రంగా చేసిన తీర్మానాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలోని ఏర్పడిన కమిటీ వీరి తీర్పులను మదించినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంపిన ప్రతిపాదనల్లోని అన్ని కోణాలనూ దృష్టిలో ఉంచుకొని ఈ ఇద్దరు శాశ్వత న్యామూర్తులుగా నియమితులయ్యేందుకు తగినవారన్న అభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొంది.













