100 శాతం సంతృప్త స్థాయి ఫలితాలుండాలి : సీయం చంద్రబాబు
100 శాతం సంతృప్త స్థాయి ఫలితాలు రావాలి. సుస్థిర వృద్ధి సాధించాలి. పేదలకు ఆదాయం పెరగాలి. హెల్త్ అండ్ న్యూట్రీషన్లో ప్రభుత్వ సేవలను మెరుగుపర్చాలి. ప్రైవేట్ భాగస్వాములు అందించే సేవలపై పర్యవేక్షణ చేయాలి. వ్యర్ధ పదార్థాల సేకరణకు అవసరమైన సంఖ్యలో వాహనాలు అందించామా లేదా అనేది కలెక్టర్లు పర్యవేక్షించాలి. తాగునీటికి టెండర్లు పిలిచారు. రూ15 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టాం. 3 ఏళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తాం.
ఫైబర్ గ్రిడ్ సహా గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ సమకూరుస్తున్నాం. చేసిన పనులను సక్రమరీతిలో ప్రజలకు కమ్యూనికేట్ చేయగలగాలి. డాటెడ్ భూములు, ఎస్టేట్ భూములు సత్వరం పరిష్కరించాలి. సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై చర్చ ప్రారంభం రేషన్ పంపిణీపై గత 2నెలల్లో ప్రజల్లో కొంత అసంతృప్తి రావడంపై చర్చ. తూకంలో, డీలర్ వ్యవహార శైలిపై కార్డుదారుల్లో అక్కడక్కడా అసంతృప్తి ఉందన్న అధికారులు నిత్యావసర సరుకుల పంపిణీలో కొత్తగా ఫుడ్ బాస్కెట్ కింద రాగులు, జొన్న వంటి చిరుధాన్యాలు అందిస్తున్నాం : ప్రజాపంపిణీ శాఖ కమిషనర్ రాజశేఖర్ చిరుధాన్యాల వాడకంపై ప్రజలను చైత్యన పరాచాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాలలో రాగుల వినియోగంపై ఆసక్తి ఉంది. కాబట్టి వారిని ప్రోత్సహించాలి.
ఆరోగ్యం పెంచే ఆహారం ప్రజలకు అందుబాటులో ఉంచాలి. మధుమేహం పెంచే ఆహారం ఆరోగ్యకరం కాదు.ప్రభుత్వం సరఫరా చేసే ఆహారం ప్రజల ఆరోగ్యం మరింత పెంచేదిగా ఉండాలి: ముఖ్యమంత్రి క్రిస్మస్ కానుక అందనివాళ్లకు ఈ నెలలో కూడా అందజేయాలి. ప్రతి కార్డుదారుడికి పండుగ కానుకలు అందేలా చూడాలి. 17,15,571 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. రైతులకు రూ.2640కోట్లు చెల్లింపులు జరిగాయి.
రేషన్ పంపిణీపై ప్రజల్లో సంతృప్తి అనుకున్నంత పెరగలేదు: ముఖ్యమంత్రి
బినామీలు రేషన్ దుకాణాలు నడపడం, రేషన్ కోసం పదేపదే డిపోల చుట్టూ తిరగడం,డీలర్ ప్రవర్తనపై, సరుకులు తూకంపై, రశీదులు ఇస్తున్నారా లేదా అనే అంశాలపై సర్వే ఫలితాలను వివరించిన ముఖ్యమంత్రి
కేవలం చర్చించి ఉపయోగం లేదు, అమలుచేసి వాస్తవరూపంలోకి తీసుకొచ్చినప్పుడే వాటికి సార్ధకత : సీయం చంద్రబాబు
వేలుముద్ర పడనివాళ్లకు గత నెలలో డోర్ డెలివర్ ఆపేయడం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
అర్హులు అందరికీ రేషన్ సక్రమంగా అందించాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరించాలి: ముఖ్యమంత్రి
క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర పర్యవేక్షణ జరిపి డిసెంబరు మాసంలో మొత్తం 61 రేషన్ దుకాణాలను సస్పెండ్ చేశాం : రాజశేఖర్
డీలర్లకు చెల్లింపులు సక్రమంగా చేయండి. రేషన్ సరిగ్గా పంపిణీచేసేలా పర్యవేక్షించండి: ముఖ్యమంత్రి
రేషన్ సరుకుల పంపిణీలో అత్యధిక సంతృప్తి కలిగిన కృష్ణా జిల్లా 85%, పశ్చిమ గోదావరి జిల్లా 84%, గుంటూరు జిల్లా 84%
అత్యల్ప సంతృప్తి జిల్లాలు అనంతపురం 76%, శ్రీకాకుళం 76%, కర్నూలు 76%
పౌరుడు ఒకడే,ప్రభుత్వం ఒకటే…శాఖలే వేర్వేరు. సమన్వయంతో్ అన్ని శాఖలూ ఏకోన్ముఖంగా పనిచేయాలి: ముఖ్యమంత్రి
పౌరసరఫరాల్లో 88% సంతృప్తితో రాష్ట్రంలోనే ముందున్న మండలాలు ఉయ్యూరు, పాలకొల్లు, తెనాలి కొత్త రేషన్ కార్డుల కోసం మొత్తం 21,565 దరకాస్తులు రాగా, అందులో 14,414 దరకాస్తులను ఆమోదించాం. 4,538 దరకాస్తులను తిరస్కరించాం. 12.1 శాతం మాత్రమే పెండింగ్లో ఉంది : రాజశేఖర్
ఏడాదిలో ప్రతినెలా వేలిముద్ర పడనివాళ్ల జాబితా రూపొందించండి. వాళ్లందరికీ డోర్ డెలివరి చేయండి: ముఖ్యమంత్రి
బయో మెట్రిక్ లో లోపాలు, ఐరిస్ లో లోపాల వల్ల కార్డుదారులకు ఇబ్బందులు ఉండకూడదు. ఇలాంటివి ఏమన్నా ఉంటే నాలుగైదు శాతం కూడా ఉండదు. అటువంటి లోపాలు కూడా నివారించాలి: ముఖ్యమంత్రి
రేషన్ డీలర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో వాళ్లతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి. అదే సమయంలో లబ్దిదారులతో వారి ప్రవర్తన ఎలా వుందనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ జరపండి : పౌర సరఫరాల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం.
పారదర్శకంగా రేషన్ పంపిణీ చేయాలి. అవకతవకలకు కళ్లెం వేయాలి.అదే సమయంలో ఏ ఒక్క కార్డుదారుడికి ఇబ్బంది పెట్టరాదు.సాంకేతిక సమస్యలతో కార్డుదారులకు ఇబ్బంది పెట్టకూడదు: ముఖ్యమంత్రి
వచ్చే నెలలో రేషన్ పంపిణీలో 90% సంతృప్తి ప్రజల్లో రావాలి. ఈ జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో స్ప్లిట్ రేషన్ కార్డులు అందిస్తాం.













