శ్రీశైలం దేవస్థానం అరుదైన రికార్డు

శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికారుజనస్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. శ్రీశైల క్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ప్రాచీన కట్టడాలు తదితర అంశాల ఆధారంగా లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నది. ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఈవో పెద్దిరాజుకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు.