Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సిట్ షాక్

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy) ఇళ్లలో ఆంధ్రప్రదేశ్ సిట్ (Sit) అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, బెంగళూరు (Bangalore)లోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ లోని ప్రకాసన్‌నగర్, యూసుఫ్‌గూడ గాయత్రీహిల్స్‌లోని మిథున్‌రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. వైసీపీ (YCP) హయాంలో జరిగిన మధ్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా సిట్ బృందం ఈ తనిఖీలు చేపట్టింది.