ఏపీలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలల ప్రారంభం ?
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను పున ప్రారంభించనున్నట్లు కేంద్రానికి అదికారులు విన్నవించారు. ఈ నెల 15న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాఠశాలల సురక్షిత ప్రణాళికపై కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాలలను పున ప్రారంభించే సమయాలను తెలపాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. వీడియో కాన్ఫరెన్సులో వెల్లడించిన వివరాల్లో ఏమైనా మార్పులు ఉంటే తెలపాలని కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఉత్తర్వులు వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున మొదట ప్రకటించినట్లు రాష్ట్రంలో ఆగస్టు 3 నుంచి పాఠశాలల పున ప్రారంభం ఉండదు. బిహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఆగస్టులో తెరవనున్నట్లు ప్రకటించాయి. తెలంగాణ, తమిళనాడు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాయి.













