Medical colleges: వైసీపీవి అన్నీ అసత్య ప్రచారాలే : సత్యకుమార్

పీపీపీ మోడల్‌లో మెడికల్ కళాశాలల (Medical colleges) నిర్మాణం వల్ల నష్టం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ (YCP) అసత్య ప్రచారంతో రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు. 33 యేళ్ల తరువాత మళ్లీ ప్రభుత్వానికి ఆ కళాశాలు చెందుతాయని, మెడికల్ కళాశాలలు పూర్తి అయితే 1500 సీట్లు వస్తాయని, ఇందులో 725 సీట్లు పూర్తిగా ఉచితమని ప్రకటించారు. ఎన్టీఆర్ (NTR) వైద్య సేవల కింద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామన్నారు. మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తెస్తే ప్రజలకు మంచి జరుగుతుందని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రజలకు ప్రతి చోటా మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో మాట్లాడుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 108, 104లను ప్రైవేటు వ్యక్తులతో నడిపారని గుర్తుచేసిన మంత్రి.. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పార్టనర్ షిప్‌తో చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. అసెంబ్లీ కి రా చర్చిద్దాం అంటే వచ్చే ధైర్యం లేదని విమర్శించారు. రిషికొండలో వందల కోట్లు తో భవనాలు నిర్మించారని, మరి ఈ మెడికల్ కళాశాలలు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.