రైట్ కేర్ ఆధ్వర్యంలో వైజాగ్ లో ఉచిత వైద్యశిబిరం
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న రైట్ ప్రో పేరుతో ఐటీ కంపెనీని ఏర్పాటు చేసిన మనోహర్ ఆ కంపెనీ విస్తరణలో భాగంగా ఇండియాలో వైజాగ్లో రైట్ కేర్ పేరుతో హెల్త్ కేర్ విభాగాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనవరి 4వ తేదీన ప్రారంభమైన ఈ రైట్ కేర్ హెల్త్ కేర్ విభాగం ఇంటివద్దనే అన్నీవిధాల వైద్య సదుపాయాలను అత్యంత నిపుణులైన, సమర్థులైన, నిష్ణాతులైన వైద్య సిబ్బంది ద్వారా అందిస్తోంది. కంపెనీ చేస్తున్న కార్యక్రమాలను అందరికీ తెలియజేసేందుకు వీలుగా విశాఖపట్టణంలో కొన్ని కార్యక్రమాలను చేస్తోంది. అందులో భాగంగా పూర్ణమార్కెట్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు 45మందికి వైద్యపరీక్షలు నిర్వహించింది. తమ వైద్యసేవలు కావాలనుకున్నవారు తమ సంస్థ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఇతర వివరాల కోసం 9115789789 ఫోన్నెంబర్ లో సంప్రదించవచ్చు.
Website: www.ritecare.in













