టీటీడీకి కేంద్ర ప్రభుత్వం షాక్!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం రూ.4.31 కోట్లు జరిమానా విధించింది. శ్రీవారికి విదేశీ భక్తులు ఆన్లైన్ ద్వారా నగదు రూపంలో కానుకలు పంపుతుంటారు. కొందరు భక్తులు తమ వివరాలు తెలుపకుండా గోప్యత పాటిస్తూ ఉంటారు. ఇలా వివరాలు వెల్లడించని వారి నుంచి సుమారు రూ.26 కోట్లు వచ్చాయి. ఈ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) టీటీడీ ఖాతాలో జమ చేయకుండా మూడు సంవత్సరాలుగా పక్కన పెట్టేసింది. దీంతో సమస్యను పరిష్కరించాలని టీటీడీ కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖలను అందుకున్న కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ టీటీడీకి 2019 సంవత్సరానికి రూ.1.014 కోట్లు జరిమానా విధించారు. ఈ నెల 5న కేంద్ర ఎప్సీఆర్ఏ విభాగం వార్షిక రిటర్స్లో హుండీలో కానుకలు వేసిన వారి చిరునామాలు లేవని టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ రాస్తు మళ్లీ రూ.3.19 కోట్లు జరిమానా విధించింది. అంటే మొత్తం రూ.4.31 కోట్ల జరిమానా విధించిందన్న మాట.













