Rammohan Naidu : సీఎం చంద్రబాబు కృషితోనే … బడ్జెట్లో రాష్ట్రానికి : రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నడూ లేనివిధంగా గత ఏడునెలల్లో ఏపీకి కేంద్రం సహకారం అందించిందని చెప్పారు. సీఎం చంద్రబాబు (Chandrababu) కృషితోనే కేంద్ర బడ్జెట్ (Budget) లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో జల్జీవన్ మిషన్ (Jaljeevan Mission) లో రూ.15 వేల నష్టం వచ్చిందన్నారు. చంద్రబాబు విజ్ఞప్తితో ఆ పథకాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకు అడ్డంకులుగా మారాయన్నారు.













