Raja Saab: రాజా సాబ్ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్(The raja Saab). ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఈ పాటికే రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ లేటవడంతో రాజా సాబ్ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందులో భాగంగానే షూటింగ్ ను నిర్విరామంగా చేస్తున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ పై ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాజా సాబ్ కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో జరుగుతుందని, ప్రభాస్ కూడా ఇవాళ షూటింగ్ లో జాయిన్ అయ్యారని, ప్రభాస్ కూడా సెట్స్ లో జాయిన్ అవడంతో రాజా సాబ్ టీమ్ ఫుల్ జోష్ లో ఉందని తెలుస్తోంది. కాగా రాజా సాబ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. టీజర్ తర్వాత రాజా సాబ్ పై అంచనాలు ఇంకాస్త పెరిగాయి. నిధి అగర్వాల్(Niddhi Agerwal), మాళవికా మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్న రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.













