Raheja: విశాఖలో రహేజా.. రూ.2,172 కోట్ల పెట్టుబడులు

విశాఖకు ప్రముఖ నిర్మాణ సంస్థ కె.రహేజా (Raheja) కార్పొరేషన్ పెట్టుబడులతో రాబోతోంది. ఐటీ (IT) సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. దీనికోసం ఆ సంస్థ రూ.2,172.26 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ప్రాజెక్టు అమలుకు మధురవాడ (Madhuravada) ఐటీ హిల్ నంబరు -3లో 27.10 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 9,681 మందికి ఉపాధి లభిస్తుందని తన ప్రతిపాదనల్లో పేర్కొంది.