Raghurama: ఎవరి మద్దతు అవసరం లేదు: రఘురామ
వైఎస్ జగన్మోహన్ రెడ్డే (YS Jaganmohan Reddy) నా టార్గెట్, నాకు ఎవరి మద్దతు అవసరం లేదు. ఒంటరి పోరాటమే నాకు ఇష్టం అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnam Raju) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District)లో ఆయన విలేకరులతో మాట్లాడారు.తాను నిర్మించిన 180 మెగావాట్ ప్రాజెక్టు విలువ రూ.2వేల కోట్లు ఉంటుందని చెప్పారు. దేశంలోనే ఇంత తక్కువ ఖరీదైన ప్రాజెక్టును ఇప్పటి వరకు ఎవరూ నిర్మించలేదని తెలిపారు. నువ్వు నాపై కావాలని పెట్టించిన 3 కేసుల ద్వారా నన్ను 420గా చిత్రీకరించారు. డిప్యూటీ స్పీకర్ పదవిని బర్తరఫ్ చేయాలని నీ వాళ్లతో మాట్లాడిస్తున్నావు అంటూ జగన్‌పై మండిపడ్డారు. 11 కేసుల్లో 420గా ఉన్న నువ్వు సీఎంగా పని చేయలేదా అని నిలదీశారు. పోరాటం తనకు కొత్తేమీ కాదన్నారు. తాను బరిలో పందెంకోడి లాంటివాడినని, చావుకు తెగించి జగన్‌తో పోరాడానని పేర్కొన్నారు. త్వరలోనే నిర్దోషిగా తిరిగి వస్తానని చెప్పారు.గన్‌పై ఒంటరిగా పోరాటం ప్రారంభించినప్పుడు తనవెనుక ఎవరూ లేరన్నారు. రెండేళ్లు ఒంటరి పోరాటం చేశానని, ఇప్పుడు తనకు ఎవ్వరి సహకారం అక్కర్లేదని చెప్పారు.






