బీజేపీ పెద్దల మనసులో ఏముందో పవన్ కు తెలుసు.. కాబట్టే
బీజేపీ పెద్దల మనసులో ఏముందో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలుసు కాబట్టే పొత్తు గురించి మాట్లాడారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ-జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించడం శుభ పరిణామమని అన్నారు. జనసేన ఎరుపు, టీడీపీ పసుపు కలిస్తే కాషాయం రంగు వస్తుందని, దానికి బీజేపీ కూడా సమ్మతిస్తుందని తాను భావిస్తున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ పార్టీల కలయిక 160 సీట్లు గెలిచి ప్రభంజనం సృష్టించడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు.













