Raashi Khanna: చూసి స్నేహం చేయమంటున్న రాశీ
ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసిన రాశీఖన్నా(Raashi Khanna) ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటూ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తుంది. రీసెంట్ గా రాశీ తమిళ మూవీ అఘాతియా(Aghathiya)తో ప్రేక్షకుల్ని పలకరించింది. కానీ ఆ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ గా నిలిచింది. ఇక అసలు విషయానికొస్తే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మంచి స్నేహితులను ఎంచుకోవడమనేది జీవితంలో చాలా ముఖ్యమని రాశీ ఈ వీడియోలో తెలిపింది. మంచి వారితో ఫ్రెండ్షిప్ చేస్తే మన జీవితం కూడా ఎంతో బావుంటుందని, అలా కాకుండా మనం ఏం చేసినా కిందకు తోసే వారితో స్నేహం చేస్తే జీవితం నాశనం అవుతుందని, తనకు జీవితంలో ఎంతో గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారని, వారే తన బలమని రాశీ చెప్పుకొచ్చింది.
అంతేకాదు, ఎప్పుడూ మన గురించి కంప్లైంట్ చేస్తూ, బిజీగా ఉన్నామని చెప్పే వ్యక్తులకు మీరు కూడా టైమ్ ఇవ్వొద్దని, తను అలానే చేస్తుందని చెప్పింది రాశీ. స్నేహం విషయంలో రాశీ క్లారిటీ చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం రాశీ తెలుగులో సిద్దూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) తో కలిసి తెలుసు కదా(Telusu Kadha) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.













