టీడీపీ వీడనున్న ఆర్ కృష్ణయ్య!
బడుగు, బలహీన సంఘాల నేత, ఎల్బీనగర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీని వీడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో తాను గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఓ ఉద్యోగ సంఘానికి అధికారిక గుర్తింపు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నిరాకరించిందన్న ఆగ్రహంతో ఉన్న ఆయన, తాను ఆ పదవి నుంచి తొలిగితే వెంటనే గుర్తింపు ఇస్తామంటూ ప్రభుత్వం మెలిక పెడుతోందని మండిపడుతున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతుల ప్రజల విషయంలో చంద్రబాబు చులకన భావంతో ఉన్నారని అభిప్రాయపడుతున్న ఆయన, అదే విషయాన్ని తన సన్నిహితులు, అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ, ఇక పార్టీ వీడితేనే మేలని భావిస్తున్నట్టు చెబుతున్నారట.













