ఉగాది రోజు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న పోతిన మహేష్..
జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ నీడగా గుర్తింపు తెచ్చుకున్న పోతిన మహేష్ పార్టీని వీడి వైసీపీలో చేరబోతున్నారు. ఉగాదిని పురస్కరించుకొని రేపు ఆయన వైసిపి తీర్థం పుచ్చుకొనున్నారు. బీసీ నేతగా ఉండడంతో పాటు జనసేనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని ముందుండి నడిపించాడు. జనసేన లో ముఖ్యమైన నాయకులు ఎవరూ అంటే పవన్ ,నాదెండ్ల మనోహర్ తరువాత వినిపించే పేరు ఆయనదే. 2019 ఎన్నికల్లో పాతిక వేలు ఓట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసారి కచ్చితంగా సీటు దక్కుతుంది అని భావించిన పోతిన చివరి క్షణంలో భంగపాటుకు గురయ్యారు. దీంతో పార్టీని విడాలి అని ఫిక్సయిన పోతినని వైసిపి సాదరంగా ఆహ్వానించింది. ఈ పరిణామంతో వైసీపీకి బలం పెరిగేలా కనిపిస్తోంది. ఇది జనసేనకు పెద్ద షాక్ అనే చెప్పాలి.













