ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 4న విశాఖ, భీమవరంలలో ఆయన పర్యటించబోతున్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు భీమవరంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని, ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు స్వస్థలం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోని పాండ్రంగా గ్రామం. చింతపల్లి అడవుల్లో ఆయన పోరాటం చేశారు. బ్రిటీష్ వారి చేతుల్లో ఆయన మరణించింంది కూడా విశాఖ ఏజెన్సీలోనే. కొయ్యూరు గ్రామంలో ఆయన చనిపోయారు. అల్లూరి జీవితం మొత్తం విశాఖ, విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంది. అందువల్ల అల్లూరి ఉత్సవాలు భీమవరంలో నిర్వహిస్తున్నప్పటికీ, విశాఖ వస్తున్న మోదీ భీమవరం కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు.













