ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు ..షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఆయన ఫర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 8:20కి ప్రధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10:40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:55కు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన కార్యక్రమం జరిగే కేసరపల్లిలోని ఐటీ పార్కు మైదానానికి వస్తారు. 11 నుంచి 12:30 గంటల వరకు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. 12:40కి అక్కడి నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రయం మీదుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు వెళ్తారు.













