Amaravati :ప్రధాని మోదీ అమరావతి పర్యటన.. షెడ్యూల్ ఖరారు
రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణాల పున ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) షెడ్యూల్ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను మోదీ ప్రారంభించనున్నా రు. ఈ కార్యక్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం, సచివాలయం (Secretariat) వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనుల పున ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా(Krishna), ప్రకాశం(Prakasam) గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్వవేక్షిస్తోంది.













