అధికారంలోకి రాగానే అందరికి అందేలా చర్యలు : పవన్
గోదావరి జిల్లాల అభివృద్ధితో పాటు కాలుష్య నివారణకు మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పార్టీ కార్యకరక్తలతో ఆయన సమావేశమ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొద్దిమంది చేతుల్లోనే విద్య, వైద్యం ఉండకూడదని, అధికారంలోకి రాగానే అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జనసేన మార్పుకోసం వచ్చిందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే పరిస్థితి లేదని పవన్ స్పష్టం చేశారు. ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా చూసే బాధ్యతను తాను తీసుకుంటానని పునరుద్ఘాటించారు. మార్పుకోసం వచ్చిన మనం మధ్యలో వెనకడుగు వేయకూడదు. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నా. విద్య, వైద్య వ్యవస్థలు కొంతమంది చేతుల్లో ఉంటే ఎలా? గోదావరి జిల్లాల కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం అని అన్నారు.













